: అక్కడా మోడీ జపమే!


నరేంద్ర మోడీ సోషల్ మీడియాలోనూ ఇతర నేతలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో యూజర్లు ఎక్కువగా మోడీ నామాన్నే స్మరిస్తున్నారు. మోడీ పేరును ఎక్కువగా పోస్టులలో పేర్కొంటున్నారని బ్లాగ్ వర్క్స్ అనే సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ జరిపిన అధ్యయనంలో తేలింది. మోడీ తర్వాత రాహుల్, ప్రధాని మన్మోహన్, సోనియా, అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఉన్నారు. 20 మంది రాజకీయ నేతలలో బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ ఆఖరున నిలిచారు. మోడీ పేరు ను 10 లక్షల సార్లు ఉపయోగిస్తే, రాహుల్ పేరును అందులో ఒక వంతులోపే వాడారు. 18-34ఏళ్ల వయసువారు మాత్రం ఎక్కువగా రాహుల్ పేరును పోస్టులలో పేర్కొన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేక టూల్ సాయంతో బ్లాగ్ వర్క్స్ ఈ అధ్యయం నిర్వహించింది.

  • Loading...

More Telugu News