: హమ్మయ్య.. హర్భజన్ సింగ్ సేఫ్


ఉత్తరాది వరదల్లో చిక్కుకున్న హర్భజన్ సింగ్ సురక్షితంగా ఉన్నాడు. హేమకుడ్ సాహిబ్ యాత్రకు వెళ్లి తిరుగుప్రయాణంలో ప్రకృతి బీభత్సంలో చిక్కుకుపోయిన క్రికెటర్ హర్భజన్ సింగ్ బుధవారం వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్ లో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఐదు రోజులుగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చడంతో హర్భజన్ నాలుగు రోజులుగా జోషీమఠ్ లోని ఐటీడీపీ శిబిరంలో తలదాచుకున్నాడు. తాజాగా ఇతను వరదప్రాంతాల నుంచి క్షేమంగా బయటపడడంతో సహచరులు హర్షం వ్యక్తం చేశారు. కాగా హర్భజన్ సింగ్ పంజాబ్ పోలీసు శాఖలో కమిషనర్ హోదా ఉద్యోగి.

  • Loading...

More Telugu News