: బుకీల నుంచి బహుమతులు అడుక్కున్న అంపైర్ రవూఫ్
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అంపైర్ రవూఫ్ అవినీతిని నిరూపించే బలమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. అసద్, విందూ దారా సింగ్ మధ్య ఏప్రిల్లో జరిగిన సంభాషణలు పోలీసులకు బలమైన ఆయుధాలు కానున్నాయి. అసద్, విందూ, మరో బుకీల మధ్య సంభాషణ ఇలా ఉంది.
అసద్ రవూఫ్: నా పుట్టిన రోజు రాబోతోంది. నీకు తెలుసా?
విందూ దారాసింగ్: అసద్ భాయ్, ఆందోళన పడకు. మేం చూసుకుంటాం. ఈ విషయాన్ని పవన్ భాయ్ (బుకీ)కు తెలియజేస్తా.
పవన్ జైపూర్ విందూ దారాసింగ్ తో: అసద్ కోసం 6లక్షలు ఖరీదు చేసే వాచ్, బంగారు చైన్ ను ప్రేమ్ తనేజా(మరో బుకీ)తో పంపిస్తున్నాను. ఢిల్లీలో వాటిని తీసుకోమని అసద్ కు చెప్పు.
అసద్ పై ఆరోపణలు రావడంతో ఐసీసీ ఇప్పటికే అతడిని చాంపియన్స్ ట్రోఫీకి దూరం పెట్టింది. ఆరోపణల తర్వాత అసద్ పాకిస్థాన్ కు పారిపోయి వాటిని ఖండించిన సంగతి తెలిసిందే.