: నాలుగేళ్ల బాలికనీ వదల్లేదు....
కామం కళ్లు కప్పేస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపో్తున్నారు. నిర్భయ ఘటన తరువాత కూడా మృగాళ్ళకు బుద్ధి రాలేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా అమలు ఆలస్యం కావడంతో కిరాతకులు రెచ్చిపోతున్నారు. తాజాగా అదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం కామన్ పల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై పుష్ఫాపూర్ గ్రామానికి చెందిన రాజేష్(29) అనే యువకుడు బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన బాలికను తల్లిదండ్రులు జిన్నారం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేటి ఉదయం బాలిక పరిస్థితి విషమించడంతో ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.