: సికింద్రాబాద్, కర్నూలు మార్గంలో నిలిచిన రైళ్లు
సాంకేతిక సమస్యతో మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వెళుతున్న గూడ్స్ రైలు దివిటిపల్లి స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. దీంతో సికింద్రాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న తుంగభద్ర ఎక్స్ ప్రెస్ ను జడ్చర్ల స్టేషన్లో నిలిపివేశారు. మహబూబ్ నగర్లో కూడా ఒక ప్యాసింజర్ రైలును నిలిపివేయాల్సి వచ్చింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యం కానున్నాయి.