: ప్యాకేజీలకు ఒప్పుకోం: గుత్తా
తెలంగాణ అంశంలో ఏ విధమైన ప్యాకేజీలకూ అంగీకరించమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకుండా ప్యాకేజీలు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు వచ్చిన వార్తలపై గుత్తా స్పందించారు. ప్యాకేజీలతో తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.