: చట్ట విరుద్ధంగా మొబైల్ వ్యాన్లో లింగ నిర్ధారణ


కడుపులో ఉన్న శిశువు ఆడ, లేక మగా అని తెలుసుకోవడాన్ని మన దేశంలో ఎప్పుడో నిషేధించారు. అయినా చట్టాలను ఉల్లంఘించే ప్రజలున్నప్పుడు, అడ్డదారులు తొక్కే ఘనులూ ఉంటారు. బెంగళూరుకు 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబళ్లాపూర్ లో ఒక రేడియాలజిస్ట్ ఏకంగా వ్యాన్లో స్కానింగ్ మిషన్ పెట్టుకుని బస్టాండ్ సమీపంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. జాతీయస్థాయి పర్యవేక్షక కమిటీ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో తనిఖీలకు వెళ్లగా ఇది బయటపడింది. ఏజెంట్లను పెట్టుకుని మరీ వారానికి రెండు రోజులు బస్టాండ్ సమీపంలో పరీక్షలు జరుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ తనిఖీలు నిర్వహించనుంది.

  • Loading...

More Telugu News