: శంకర్రావు అరెస్టు వ్యవహారంపై సీఐడీ ఆరా
మాజీమంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఉదంతంపై పూర్తి వివరాలు సేకరించేందుకు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ సారధ్యంలోని బృందం శంకర్రావు చికిత్స పొందుతున్న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ శంకర్రావు కుటుంబసభ్యులతో రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా, అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలను సీఐడీ తెలుసుకుంది. అయితే, ఈ రోజు శంకర్రావుతో మాత్రం మాట్లాడలేదని కృష్ణప్రసాద్ తెలిపారు.