: కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా రద్దు


ఉత్తరాఖండ్ లో వరదల కారణంగా రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతినడంతో కైలాస మానస సరోవర యాత్రను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. పలు మార్గాలలో రహదారులు, వంతెనలు దెబ్బతిన్నందున యాత్రీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యాత్రను రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దెబ్బతిన్న మార్గాలను పునరుద్ధరించడానికి నెల రోజుల సమయం పడుతుందని ఛత్తీస్ గఢ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో 2 నుంచి 10వ బ్యాచ్ వరకూ మానససరోవర యాత్రను రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

కైలాస మానససరోవరం చైనా భూభాగంలో ఉంది. ఏటా జూన్ 9 నుంచి సెప్టెంబర్ 9వరకూ యాత్ర కొనసాగుతుంది. దీనిని విదేశాంగ శాఖే పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది మొత్తం 18 బ్యాచ్ లను మనదేశం నుంచి పంపడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కో బ్యాచ్ లో 60 మంది యాత్రికులు ఉంటారు. ప్రతీ బ్యాచ్ యాత్ర పూర్తి చేసుకోవడానికి 22 రోజుల సమయం పడుతుంది. ఇందులో 14రోజులు మన దేశంలో మిగతా రోజులు చైనాలో కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News