: మమత సంచలన వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చేందుకు సీపీఎం తనను చంపేందుకు కుట్ర పన్నిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మావోయిస్టులతో చేతులు కలిపి తనను అంతం చేయాలని చూశారని ఆమె చెప్పారు. 'కాంగ్రెస్, భాజపాలతో కూడా కలిసి సీపీఎం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నింది. పదవిలోకి రావాలన్న కోరికతో సీపీఎం పార్టీ మావోయిస్టుల ద్వారా నన్ను చంపేయాలని ప్రయత్నించింది. దీనికి సంబంధించిన నిఘా వర్గాల సమాచారం కూడా నా దగ్గర ఉంది' అంటూ మమత వెల్లడించారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా బోస్గావ్ సమీపంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. సోమవారం కందుని గ్రామానికి తాను వచ్చినప్పుడు తనను చంపేయాలని ప్రణాళిక వేశారని మమత అన్నారు. తల్లి, భూమి, ప్రజలు తన వెంట ఉన్నంతవరకు తనకే హానీ జరగదని మమత చెప్పారు.