: సమరానికి సిద్ధం.. సై అంటున్న భారత్, శ్రీలంక
లీగ్ స్టేజ్‌లో ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్నిట్లోనూ తిరుగులేని ఫామ్. ప్రపంచ చాంపియన్ హోదాకు తగినట్లు ఆటతీరు. శ్రీలంకతో కీలక సెమీఫైనల్ సమరానికి ముందు టీమిండియా దూకుడుకు సిద్ధంగా ఉంది. టీమిండియా నేడు చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో శ్రీలంకతో తలపడబోతోంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో ధోనీ సేనే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. అయితే శ్రీలంక ప్రమాదకరమైన జట్టని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. కానీ, ఫైనలే లక్ష్యంగా బరిలో దిగుతాం అంటున్నాడు. ఈ రోజు 3 గంటలకు కార్డిఫ్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.