: చురుగ్గా పెరిగితే... తెలివిమంతులౌతారు


పుట్టిన బిడ్డ తొలి నాలుగు వారాల్లో చక్కగా చురుగ్గా ఆరోగ్యంగా పెరగడం ఎంతో అవసరం. నవజాత శిశువులు పుట్టిన నాలుగు వారాల్లోగా చక్కగా పెరిగితే తర్వాత కాలంలో వారు మంచి ప్రతిభావంతులు అవుతారని ఒక తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంటే పుట్టిన తర్వాత శిశువు తలపరిమాణం, ఇంకా బరువులోను మంచి మెరుగైన పెరుగుదల ఉంటే ఆ బిడ్డకు వయసు వచ్చేసరికి వారిలో ప్రజ్ఞాలబ్ధి మరింత ఎక్కువ కావడానికి దోహదపడుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.

అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ మేరకు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వీరు ఈ అధ్యయనం కోసం సుమారు 13,800 పైగా నవజాత శిశువుల వైద్య రికార్డులను పరిశీలించారు. ఈ పరిశోధనలో పుట్టిన తొలి నాలుగు వారాల్లో శిశువుల బరువు నలభై శాతం పెరిగితే వారికి ఆరేళ్లు వచ్చేసరికి వారిలో ప్రజ్ఞాలబ్ధి 1.5 పాయింట్లుగా ఉందని తేలింది. అంటే శిశువు తలపరిమాణం పెరిగే తీరు కూడా ఆయా పిల్లల ప్రజ్ఞాలబ్ధిని ప్రభావితం చేసినట్టు తమ పరిశోధనలో వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News