: తెలుగు వారియర్స్ లక్ష్యం 135
సినీ తారల తళుకులతో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం జిగేలుమంది. సీసీఎల్ తారల క్రికెట్ మ్యాచులో ముంబై హీరోస్ జట్టు, తెలుగు వారియర్స్ కు 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై హీరోస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో 19.5 ఓర్లకు గాను 135 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు హీరోయిన్లు, హీరోలు అభిమానులను ఉల్లాసపరిచారు. తెలుగు హీరోలు చక్కగా బౌలింగ్ చేశారు.