: చిన్న పురుగులను పెద్దగా చూపొచ్చు!


మనకు త్రీడీ సినిమాల్లో చిన్న చిన్న చీమలు కూడా పెద్దగా కనిపిస్తుంటాయి కదూ... అలాగే కంటికి కనిపించని పురుగులను పెద్ద ఆకారంలో చూపించవచ్చట. ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిజ్ఞానంతో కంటికి కూడా కనిపించనంతటి పరిమాణంలో ఉండే సూక్ష్మజీవులను 50 రెట్లు ఎక్కువ పరిమాణంతో ఉన్నదున్నట్టుగా కృత్రిమ పురుగులను తయారు చేశారు. సహజంగా సూక్షజీవుల్లో అత్యంత చిన్న పరిమాణంలో ఉన్న వాటి గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఈ విధంగా సూక్ష్మజీవులను అధిక పరిమాణంలో సృష్టించడం వల్ల వాటి గురించి మరింత విపులంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఆష్ట్రేలియాలోని సీఎన్‌ఐఆర్‌ఓ సంస్థకు చెందిన పరిశోధకులు ఇలా ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ పురుగులను తయారు చేశారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానం కేవలం బాహ్య రూప నిర్మాణానికే పరిమితమైందని, భవిష్యత్తులో ఈ పరిజ్ఞానంతో సూక్ష్మజీవుల అంతర్నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను కూడా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News