: బరువు పెరగడం కూడా రోగమే!
ఊబకాయం అనేది నేటి సమాజంలో ఎక్కువగా పెరిగిపోతోంది. పలు దేశాల్లో వూబకాయుల సంఖ్య ఎక్కవ కావడం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో వూబకాయుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని వ్యాధిగా గుర్తిస్తూ, ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి పలు సూచనలు సిఫారసులను చేసింది. అమెరికాలో గత ఇరవై ఏళ్లలో పెద్దవారిలో ఊబకాయం రెంట్టింపుకాగా, పిల్లల్లో ఒకే తరంలో మూడింతలైందని ఏఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు ఏన్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇప్పటికే ఊబకాయాన్ని వ్యాధిగా గుర్తించాయి.
ఈ ఊబకాయం వల్ల మధుమేహం, గుండెజబ్బులు, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. అంతేకాదు, దేశంలో ఊబకాయుల సంఖ్య పెరిగితే వారికొరకు చేసే ఆరోగ్య రక్షణ వ్యయం కూడా మరింత పెరుగుతుందని ఏఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో ఊబకాయాన్ని సంక్లిష్ట వ్యాధిగా గుర్తించాలంటూ అటు వైద్యులకు, ఇటు బీమా కంపెనీలకు ఏఎంఏ సిఫారసు చేసింది. అంతేకాదు... ప్రజల్లో అధిక బరువు వల్ల కలిగే ముప్పు గురించి అవగాహన కల్పించాలని, ముమ్మరంగా ఈ విషయం గురించి ప్రచారం చేయాలని కూడా ఏఎంఏ ప్రభుత్వానికి సూచిస్తోంది.