: ట్రాట్ ఫటాఫట్.. ఫైనల్లో ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. వన్ డౌన్ బ్యాట్స్ మన్ జోనాథన్ ట్రాట్ (82 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. నేడు లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన తొలి సెమీస్ సమరం ఇంగ్లండ్ ఆటగాళ్ళ అద్వితీయ ప్రదర్శనతో ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 38.4 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ జట్టు 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 179 పరుగులతో విజయభేరి మోగించింది. ఆ జట్టులో రూట్ 48, బెల్ 20 పరుగులు చేశారు.