: ఒక్క డైలాగ్ తో చుక్కెదురైంది!


పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ బిరుదాంకితుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం చిక్కుల్లోపడింది. బాలీవుడ్ సినిమాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పొరుగుదేశం పాకిస్తాన్ లో సాఫీగా విడుదల అవుతుంటే, భాగ్ మిల్కా భాగ్ కు మాత్రం చుక్కెదురైంది. ఆ సినిమాపై పాక్ లో నిషేధం విధించారు. ఈ చిత్రం పాక్ వర్గాల ఆగ్రహానికి గురవడానికి ఓ డైలాగ్ కారణమని చెబుతున్నారు. మిల్కా సింగ్ పాత్రధారి ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాలో ఓ సందర్బంలో.. 'ముజ్ సే నహీ హోగా, మై పాకిస్తాన్ నహీ జావూంగా' (నాకేం కాదులే, నేను వెళ్ళేది పాకిస్తాన్ కాదుగా) అని అంటాడు. ఈ డైలాగే పాకిస్తాన్ కు కోపం తెప్పించిందని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News