: యానిమేషన్ కు మరింత ఊతం
యానిమేషన్, గేమింగ్, మీడియా రంగాలకు మరింత ఊతం లభించనుంది. ఈ రంగాలకు పెరుగుతున్న ప్రాచుర్యాన్ని గమనించిన రాష్ట్రప్రభుత్వం వీటిపై పరిశోధనలు చేసేందుకు నెదర్లాండ్స్ కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు 'ద నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ సైంటిఫిక్ రీసెర్చ్' ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సచివాలయంలో సంప్రదింపులు జరిపారు. ఈ రంగాల్లో ఐటీ పరిశోధనల కోసం నెదర్లండ్స్ సంస్థ ఆర్ధిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని పొన్నాల తెలిపారు.