: జేడీ బదిలీపై ప్రమాణపత్రం దాఖలు చేసిన సీబీఐ


సీబీఐ జేడీ బదిలీ వ్యవహారంపై ఈ రోజు హైకోర్టులో సీబీఐ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్, సీబీఐ జేడీ బదిలీపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఈ రోజు విచారణ ప్రారంభమయింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ పై రెండు వారాల్లోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక జేడీ బదిలీ వ్యవహారంలో ప్రమాణపత్రం దాఖలు చేసిన సీబీఐ.. పర్యవేక్షణాధికారినే బదిలీ చేశామని, విచారణాధికారిని బదిలీ చేయలేదని తెలిపింది. పర్యవేక్షణాధికారి బదిలీతో కేసు విచారణకు ఎటువంటి ఆటంకం కలగదని సీబీఐ ప్రమాణపత్రంలో పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశించించిన హైకోర్టు.. బదిలీ ప్రక్రియ పూర్తయినందున దానిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆ ప్రమాణపత్రంపై అభ్యంతరాలుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News