: సఫారీలు కుప్పకూలుతున్నారు
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ వ్యూహం బాగా ఫలించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి దక్షిణాఫ్రికా బెంబేలెత్తిపోతోంది. 20.2 ఓవర్లలో 76 పరుగులకే 7 వికెట్లు పోగొట్టుకొని సఫారీలు విలవిల్లాడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, ట్రెడ్ వెల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, బ్రాడ్, ఫిన్ చెరో వికెట్ ఎగరేశారు. మెక్ లారెన్ ను ట్రాట్ రనౌట్ చేశాడు.