: మన 'టాప్' మరింత పదిలం


భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలో 119 పాయింట్లతో ఉన్న టీమిండియా లీగ్ దశ అనంతరం 121 పాయింట్లతో మరింత ముందుకెళ్ళింది. కాగా, ర్యాంకింగ్స్ జాబితాలో ధోనీ సేన తర్వాతి స్థానంలో వరుసగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. ఇక ఆటగాళ్ళ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బౌలర్ల జాబితాలో జడేజా (3వ ర్యాంకు) టాప్-5లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 15వ స్థానానికి దిగజారాడు. ఇక వరుస సెంచరీల వీరుడు శిఖర్ ధావన్ 50వ స్థానానికి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ మూడోస్థానంలో, ధోనీ నాలుగోస్థానంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News