: హైంజ్ కెచప్ ను సొంతం చేసుకున్న వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరుడు, బెర్క్ షైర్ హాత్ వే అధిపతి వారెన్ బఫెట్ తాజాగా కెచప్ తయారీ సంస్థ హైంజ్ ను సొంతం చేసుకున్నారు. బ్రెజిల్ కు చెందిన 3జీ క్యాపిటల్ సంస్థతో చేతులు కలిపిన బఫెట్... దాదాపు 1.4 లక్షల కోట్లతో హైంజ్ సంస్థను కొనుగోలు చేశారు. అయితే సంస్థలో భాగస్వామి అయినా కూడా వాటి రోజువారి వ్యవహరాల్లో తలదూర్చనని బఫెట్ చెప్పడం విశేషం. ఇప్పటికే కోకాకోలా వంటి దిగ్గజ ఆహర సంస్థలతో పాటు ఐబీఎం వంటి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కూడా బఫెట్ కు ప్రధాన వాటాలు ఉన్నాయి.