: విశ్వాస పరీక్షలో విజయం సాధించించిన నితీష్
విశ్వాసపరీక్షలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్న నితీష్ ఈ రోజు విశ్వాసపరీక్షకు సిద్ధమయ్యారు. నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు నమోదవడంతో విజయం సొంతమయింది. అంతకుముందు భాజపా సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం నితీష్ మాట్లాడుతూ, నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి విడిపోయిన తరువాత బీహార్ లౌకిక రాష్ట్రమయిందని వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీకి పాలన కంటే ప్రచార కండూతే ఎక్కువని నితీష్ ఆరోపించారు.