: మేం ఆ వీడియో చూడాలి: ధర్మాన, సబిత
రాజీనామా లేఖలు సమర్పించిన అనంతరం మీడియాతో ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడిన వీడియో ఆధారంగా వారిద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ మెమో దాఖలు చేయగా.. ఆ విచారణను కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. ఆ వీడియోను తాము చూశాకే న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తామని సబిత, ధర్మాన కోరడంతో సీబీఐ న్యాయస్థానం వాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా, ఈ మాజీ మంత్రులు ఓ మెలిక పెట్టారు. ఆ వీడియో ఎడిట్ చేసి ఉండకూడదని అంటున్నారు. దీనిపై, సీబీఐ స్పందిస్తూ.. తాము ఆ వీడియోను యూట్యూబ్ నుంచి సేకరించామని కోర్టుకు తెలిపింది.