: కేటీఆర్ సెటిల్ మెంట్ల దందాపై ఏబీఎన్ కథనం
ఒడిసాలో ఎస్ఆర్ఎస్ఎస్ అనే కన్ స్ట్రక్షన్ కంపెనీ యజమాని సుభాష్ అగర్వాల్, ఆయన బంధువు ఒకరిని కిడ్నాప్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి వ్యవహారంలో కేటీఆర్ కు పాత్ర ఉందని పరోక్షంగా పేర్కొంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది.
హైదరాబాద్ లో ఒక భూ వివాదం విషయంలో అన్న(కేటీఆర్?) సూచనల మేరకే సతీష్ రెడ్డి రంగలోకి దిగినట్లుగా ఆ కథనం పేర్కొంది. అయితే, వ్యవహారం బెడిసికొట్టడంతో సతీష్ రెడ్డి పోలీసులకు దొరికిపోయాడని, కానీ అన్న మాత్రం తెరచాటుగానే ఉండిపోయాడంటూ వివరణాత్మక కథనాన్ని ఈ ఉదయం ప్రసారం చేసింది.