: కేవలం ఫైటర్నే కాదు, మంచి నటుడిని కూడా: జాకీ చాన్


తననో ఫైటర్, యాక్షన్ నటుడిగానే చూడడం జాకీ చాన్ కు విసుగు తెప్పించింది. భారత్ కు వచ్చిన ఈ హాంకాంగ్ నటుడు తన మనసులోని భావాలను బయటపెట్డాడు. ఢిల్లీలో తొలిసారిగా జరుగుతున్న చైనా ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించి మాట్లాడాడు. పాడడమన్నా, డాన్స్ చేయడమన్నా ఎంతగానో ఇష్టపడతానని చెప్పాడు. "వాస్తవానికి నేనో మంచి నటుడిని. కేవలం ఫైట్ ఫైట్ ఫైటే కాదు" అని నవ్వుతూ అన్నాడు. భారత దర్శకులు మంచి పాత్రలతో తనకు ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. యాక్షన్ నటుడు అనే ముద్ర నుంచి బయటపడి నటుడిగా గుర్తింపును పొందాలనుకుంటున్నానని తెలిపాడు.

"సినిమాలలో శాంతిని చూపిస్తున్నాం. మనకు నచ్చిన వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవచ్చు. కానీ పొరుగునున్న వారిని ఎంపిక చేసుకోవడం మన చేతుల్లో లేదు. మనం(భారత్-చైనా) వేలాది సంవత్సరాలుగా పొరుగు దేశాలుగా ఉన్నాం. ఎందుకు ప్రేమగా ఉండకూడదు? ఎందుకు పరస్పరం ద్వేషించుకోవడం?" అని జాకీ చాన్ ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News