: సహాయక చర్యలు ముమ్మరం: చిదంబరం
ఉత్తరాఖండ్ లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కోర్ కమిటీలో ఉత్తరాఖండ్ వరద పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వరద సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ వరద బాధితులకు సత్వర సాయం చేస్తున్నామని తెలిపారు. బాధితులకు ఆహారం, మంచినీరు, మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వరదల్లో చనిపోయినవారి సంఖ్య నేటికి 130కు చేరుకుంది.