: హువే నుంచి పలుచని స్మార్ట్ ఫోన్
ప్రపంచంలోనే అత్యంత స్లిమ్ స్మార్ట్ ఫోన్ అసెండ్ మేట్ ను హువే భారత మార్కెట్లో విడుదల చేసింది. 6.1 అంగుళాల తాకేతెర, 1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో ప్రైమరీ కెమెరా, డాల్బీ డిజిటల్ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. వీడియోలను అధిక నాణ్యతతో చూసేందుకు ఇది అనువుగా ఉంటుందని హువే తెలిపింది. ఇందుకోసం ఎక్కువ గంటల పాటు పవర్ అందించేలా 4050 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేసింది. దీనివల్ల 10 గంటలపాటు 3జీ నెట్ పై, విడిగానూ వీడియోలు చూసుకోవచ్చని, సాధారణ వినియోగానికైతే రెండు రోజుల పాటు బ్యాటరీ పవర్ నిలిచి ఉంటుందని హువే వెల్లడించింది. 6.5 మిల్లీ మీటర్ల మందం ఉండే దీని ధర 24,900 రూపాయలు.