: చార్ ధామ్ బాధితుల వెతలు
వరదల నుంచి ఎలాగోలా బయటపడిన చార్‌ధామ్ యాత్రికులను కష్టాలు వీడట్లేదు. తిండి, నీరు లేక వారు అల్లాడిపోతున్నారు. అరటిపండ్లతో కొందరు, నీళ్లు తాగి మరికొందరు కడుపు నింపుకుంటున్నారు. కొందరు వ్యాపారులు ఇదే అదనుగా ప్లేటు భోజనాన్ని మూడు వందల రూపాయలకు అమ్ముకొంటున్నారు. దొరికిందే తింటూ, వర్షపునీరే తాగుతూ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల్లో ఎక్కువమంది వృద్ధులే ఉండడంతో వారు చలికి తాళలేక జ్వరాలతో బాధపడుతున్నారు. మందులు కూడా అందుబాటులో లేవు.