: కాంగ్రెస్ నేతల ఒత్తిడి బాగానే ఉంది: గాదె వెంకటరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి హైకమాండ్పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కోరటంలో తప్పులేదని, అయితే ఎన్నికల్లో పోటీ చేయననటం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కావటం కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ తరపున పోటీ చేయమని చెప్పడం సరికాదని గాదె అన్నారు.