: హైదరాబాదులో సినీ తారల క్రికెట్ సందడి
తెలుగు, హిందీ చిత్రసీమల హీరోలు పరస్పరం తలపడుతున్నారు. అయితే, అది సీసీఎల్ మ్యాచులో మాత్రమే. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ముంబై హీరోస్ కు, తెలుగు వారియర్స్ కు మధ్య జరగుతున్న క్రికెట్ మ్యాచ్ ని సినీ, క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఈ మ్యాచులో ముంబై హీరోస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తోంది.
టాలీవుడ్ వారియర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూండటంతో తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి ముంబై హీరోస్ మూడు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు స్టేడియంలో ప్రధాన ఆకర్షణగా మారారు.