: యమునా నది ఉగ్రరూపం
యమునా నది మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. 207మీటర్ల ఎత్తులో ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. 35 ఏళ్లలోనే అత్యంత గరిష్ఠ స్థాయి ఇది. ఢిల్లీలో యమునా తీరం, లోతట్టు ప్రాంతాల నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానాలోని హతీకుండ్ బ్యారేజీ నుంచి 9లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. దీంతో ఢిల్లీ నగరంలో యమున ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో యమునా నదికి 8లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చెప్పారు. సైన్యం సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు.