: ఉరి తీసే ముందు కుటుంబానికి అఫ్జల్ రాసిన లేఖలోని అంశాలు
పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురు..శిక్ష అమలు చేసే ముందు తన కుటుంబానికి లేఖ రాశారు. ఆయన మరణించిన 26 గంటల తర్వాత ఆ లేఖ అతని భార్యకు చేరింది. అతని లేఖ క్లుప్తంగా ఉంది.
అఫ్జల్ గురు కుటుంబానికి రాసిన లేఖ వివరాలు :
'
6:25 AM 9/2/2013
ప్రియమైన కుటుంబానికి మరియు శ్రేయోభిలాషులకు,
మీ అందరికీ శాంతి కలుగుగాక,
నేను సాధించిన దానికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నమ్మకం ఉన్న వారందరికీ, నా ఆశీస్సులు. మనమందరం సత్యానికి, మన విలువలకి కట్టుబడి ఉండాలి, చివరి మజిలీ వరకు కూడా సత్యం, విలువలు మనతోనే ఉండాలి. నా అంతం గురించి బాధపడకుండా, నేను సాధించిన దాన్ని గౌరవించాలని నా కుంటుంబాన్ని కోరుతున్నాను.
సర్వ రక్షకుడైన ఆ భగవంతుడు మీకు సహయం చేయుగాక,
మిమ్మల్ని నేను అల్లా రక్షణలో వదిలి వెళుతున్నాను'