: వణుకుడు రోగానికి జిగురు మందు
మనలో కొందరికి వణుకుడు వ్యాధి ఉంటుంది. తమ ప్రమేయం లేకుండానే శరీరంలోని అవయవాలు వణుకుతుంటాయి. ఈ వ్యాధికి కారణమయ్యే ఆల్ఫా సైనూక్లీన్ అనే ప్రోటీన్‌ను నిలువరించే ఒక జిగురు మందును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపేరు మానిటోల్.
టెల్ అవీన్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాలతో కలిసి సాగొల్ స్కూలుకు చెందిన న్యూరోసైన్స్ విభాగ పరిశోధకులు ఈ మందును కనుగొనేందుకు కృషి చేశారు. మానిటోల్ శిలీంధ్రాలు (ఫంగస్), బాక్టీరియాలు, శైవలాలు (నాచు) నుండి తయారవుతుంది. మూత్రస్రావానికి, శరీరంలో పేరుకుపోయిన ద్రవాలను ఇది బయటికి పంపేస్తుంది. అయితే ఈ మానిటోల్‌పై పరిశోధకులు మరిన్ని పరిశోధనలు చేశారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించడం ద్వారా మనుషుల్లో వణుకు రావడానికి కారణమయ్యే ప్రోటీన్‌ను నిరోధించే శక్తి దీనికి ఉందని పరిశోధకులు నిర్ధారించారు.