: తల్లి కంఠానికి స్పందించే గర్భస్థ శిశువులు


మహాభారతంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు తన తల్లి సుభద్ర కడుపులో ఉండగానే పద్మవ్యూహం గురించి తెలుసుకున్న విషయం మనకు తెలిసిందే. తల్లి గర్భంలో ఉండగానే, ఆ శిశువు అంతపెద్ద సమాచారాన్ని ఎలా అందిపుచ్చుకున్నాడని సందేహం రావచ్చు. కానీ, అది అక్షర సత్యం అంటున్నారు నేటి శాస్త్రజ్ఞులు. శిశువులు గర్భకోశంలో ఉన్నప్పుడు తల్లి కంఠధ్వనికి స్పందిస్తారట. ఆమె కథలూ వగైరా చదువుతున్నప్పుడు వారు చెవులు రిక్కిస్తారని సదరు పరిశోధకులు అంటున్నారు.

అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తల్లి బిగ్గరగా ఏమైనా మాట్లాడుతున్న సమయాల్లో, వల్లెవేస్తున్న వేళల్లో ఆ శిశువులు కదలడం ఆపేస్తారట. అంతేగాకుండా, వారి హృదయస్పందన కూడా నిదానిస్తుందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News