: సీపీఐ నారాయణ అరెస్టు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నేడు అనంతపురంలో అరెస్టయ్యారు. మిస్సమ్మ బంగ్లా భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ నేడు ఆందోళన చేపట్టింది. ఆ భూముల్లో ఉన్న బీఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ బోర్డును తొలగించేందుకు నారాయణ, ఇతర సీపీఐ కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, పోలీసులు నారాయణ తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.