: ధర్మాన, సబితకు న్యాయసహాయం ఉంటుంది: సీఎం
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డికి ప్రభుత్వం నుంచి న్యాయసహాయం అందుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లిద్దరూ తనకు తెలిసీ ఎలాంటి తప్పు చేయలేదని సీఎం పేర్కొన్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పార్టీ పరంగా సహాయం లభిస్తుందన్నారు.