: 'అద్దెగర్భం' వివాదంలో షారూఖ్ ఖాన్


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరోసారి వివాదం అంచుల్లో నిలిచాడు. సరోగసీ (అద్దెగర్భం) ద్వారా మూడో బిడ్డను పొందాలని ఉందని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడు. ఆ శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించినట్టు షారూఖ్ పై మీడియాలో కథనాలు వెల్లువెత్తగా, పలు స్వచ్ఛంద సంస్థలు ఆయనపై మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఇండియన్ రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు జోక్యం చేసుకుంది.

నిజానిజాలు తెలుసుకోండంటూ.. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని ఆదేశించింది. అయితే, బీఎంసీ ప్రతినిధులు షారూఖ్ నివాసానికి వెళ్ళగా.. అక్కడ వారికి నిరాశే మిగిలింది. సమయానికి షారూఖ్ ఇంట్లో లేడట. ఏదేమైనా, షారూఖ్ కు ఈ వ్యవహారంలో తలనొప్పి తప్పకపోచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News