: ప్రాణం కాపాడాల్సిన వాళ్ళే ఆయువు తీశారు!
మన రాష్ట్రంలో ఎవరికైనా, ఎక్కడైనా ప్రమాదం వాటిల్లితే.. 108 నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ వీలైనంత వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుంటుంది. సదరు బాధితుల ప్రాణాలను నిలిపేందుకు 108 సిబ్బంది తమ శాయశక్తులా కృషి చేస్తారు. కానీ, విశాఖపట్నం జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఆయువు నిలిపే 108 వాహనం ఇద్దరి మృతికి కారణమైంది. ఈ ఉదయం జిల్లాలోని నర్సీపట్నం మండలం జోగినాథునిపాలెం వద్ద 108 వాహనం ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో, ఆ బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మరొకరు గాయపడగా పోలీసులు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.