: ఔషధ ప్రయోగం వికటించింది
హైదరాబాదులో ఓ లాబొరేటరీ నిర్వహించిన ఔషధ ప్రయోగం వికటించడంతో ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అమీర్ పేటలోని వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిపై జీవీకే లాబొరేటరీస్ కొత్తగా తయారుచేసిన ఓ ఔషధాన్ని ప్రయోగించింది. ప్రయోగించిన కొద్ది సేపటికే వెంకటరామిరెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.