: సీఎం.. దొంగలబండికి కెప్టెన్: పయ్యావుల


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగల బండికి నాయకత్వం వహిస్తోన్నట్టుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రులపై ఈ రోజు శాసనసభలో చర్చ సందర్భంగా పయ్యావుల ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన సభలో మాట్లాడుతూ, కళంకిత మంత్రులపై న్యాయపోరాటానికి శ్రీకారం చుట్టింది టీడీపీయేనని గుర్తు చేశారు. కొద్దిరోజుల్లో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్ళడం తథ్యమని చెప్పారు. కాగా, పయ్యావుల వ్యాఖ్యలపై మాజీ మంత్రి ధర్మాన స్పందించారు.

విచారణ వివరాలు తెలుసుకోకుండానే టీడీపీ మాట్లాడుతోందని అన్నారు. ఇక ధర్మాన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. బాబు గనుక సభలో ఉండి ఉంటే, టీడీపీ ఎమ్మెల్యే తీరును గర్హించేవారని, వారి వ్యాఖ్యలను తప్పుబట్టేవారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News