: రైల్లో రాజస్థాన్ ప్రయాణీకుల రాక్షసత్వం
సీటు గురించి చిన్న వాదులాట. అంతే.. రాజస్థాన్ కు చెందిన ప్రయాణికులు రాక్షసంగా ప్రవర్తించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన శివశంకర్ రామేశ్వరం రైలులో ఖమ్మం నుంచి విజయవాడకు వెళుతున్నాడు. రైలు చింతకాని సమీపంలోని పాతర్లపాడు వద్దకు చేరుకునే సరికి శివశంకర్ ను రాజస్థాన్ ప్రయాణికులు రైల్లోంచి బయటకు తోసేశారు. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశారు.