: చిదంబరాన్ని కలిసిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖమంత్రి చిదంబరాన్ని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చిదంబరానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ పరిస్థితుల గురించి గవర్నర్ ను చిదంబరం అడిగి మరీ తెలుసుకున్నట్లు తెలుస్తోంది.