: మంత్రి ప్రసాద్ కుమార్ కు అందని తెలంగాణ సమావేశ ఆహ్వానం
ఈ రోజు మధ్యాహ్నం జరిగే తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశానికి మంత్రి ప్రసాద్ కుమార్ కు ఆహ్వానం అందలేదు. తెలంగాణవాదినైన తనకు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు. పిలవని సమావేశానికి వెళ్లలేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం దేనికైనా వెనుకాడనని ప్రసాద్ కుమార్ అన్నారు.