: కొండచరియ విరిగిపడి పదిమంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సానికి పదిమంది బలయ్యారు. కిన్నౌపూర్లో కొండచరియలు విరిగిపడడంతో వీరు మృతి చెందారు. కిన్నౌపూర్లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ, సైన్యం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.