: సీఎం దోచుకుంటున్నారు: భూమన
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కలసి దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని భూమన మండిపడ్డారు. విద్యుత్ ధరల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. కరెంట్ కోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని భూమన అన్నారు.