: ప్రమాద స్థాయిలను దాటిన గంగా, యమున
ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు యమునా నదీ తీరం, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రమాదస్ధాయిని దాటి పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గంగానదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.