: ఇక కేన్సర్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు!


కేన్సర్‌ వ్యాధి మనిషికి వచ్చే భయంకరమైన వ్యాధుల్లో ఒకటి. ఇది వచ్చినప్పటికన్నా... వ్యాపించడం ప్రారంభమయినప్పుడు క్రమేపీ మనిషి మృత్యువు వైపుకు అడుగేస్తుంటాడు. తనకు తెలియకుండానే... తనకు ఇష్టం లేకున్నా కూడా మనిషి చావు వైపుకు ఒక్కో అడుగు వేస్తూ చివరికి మృత్యువును సమీపిస్తాడు. ఈ క్యాన్సర్‌ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? అనే విషయం శాస్త్రవేత్తలకు పెద్ద సమస్యగా తయారయ్యింది. అయితే ఈ విషయాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

క్యాన్సర్‌ వ్యాధి విస్తరించడం ప్రారంభమయితే మనిషి ప్రమాదానికి చేరువవుతాడు. ఈ వ్యాధి ఎలా విస్తరిస్తుంది? అనే విషయాన్ని తాము కనుగొన్నామని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. డాక్టర్‌ రోబర్టో నేతృత్వంలో ఈ విషయంపై వీరు విస్తృతంగా పరిశోధనలను జరిపారు. కేన్సర్‌ కణాలు శరీరంలోని ఆరోగ్యవంతమైన ఇతర కణాలతో ఎలా ప్రవర్తిస్తున్నాయి? అనే విషయంపైన వీరు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో కేన్సర్‌ విస్తరణ ఎలా జరుగుతుంది? అనే విషయాన్ని వీరు కనుగొనడం జరిగింది. తాము కనుగొన్న ఈ తాజా సమాచారంతో ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధికి మరింత మెరుగైన చికిత్సను రూపొందించేందుకు వీలవుతుందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News