: మృత్యుంజయుడు


పదిహేను అంతస్తుల భవనం నుండి కిందపడితే... ప్రాణాలతో బ్రతకడం అసాధ్యం. అయితే ఈ కుర్రాడు పదిహేను అంతస్తుల నుండి కిందికి పడ్డా బతికి బయటపడ్డాడట. ఇరవై ఏళ్ల టామ్‌ స్టిల్‌వెల్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి అక్లాండ్‌లోని ఒక అపార్టుమెంటులోని తన ఇంటికి వెళ్లేందుకు వచ్చాడు. అయితే ఇంటికి తాళం వేసివుంది. దీంతో ఇంట్లోకి వెళ్లేందుకు పక్కింటి వారిని అనుమతి కోరాడు. 'మీ ఇంటి బాల్కనీ నుండి మా ఇంటికి వెళతా'నని టామ్‌ పక్కింటి వాళ్లను అడిగాడు. వారి ఇంటి బాల్కనీ నుండి తన గదిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి పక్కనే ఉన్న రెండంతస్తుల భవనంపై పడిపోయాడు. ఇంత ఎత్తునుండి కిందపడితే ఇంకొరైతే ప్రాణాలతో బతకడం అసాధ్యం. అయితే టామ్‌ మాత్రం చిన్నపాటి దెబ్బలు, అక్కడక్కడా ఎముకలు విరగడం వంటివి మినహాయించి ప్రాణాలతో బతికిబయటపడ్డాడు. నిజంగా టామ్‌ మృత్యుంజయుడే కదా...!

  • Loading...

More Telugu News