: బ్రిటీష్ పత్రికకు ఎడిటర్ గా 29 ఏళ్ళ భారత సంతతి యువకుడు
విదేశాల్లో భారత సంతతి యువతీయువకులు పలు రంగాల్లో సత్తా చాటడం చూస్తూనే ఉన్నాం. అతిక్లిష్టమైన పాత్రికేయరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, 29 ఏళ్ళకే ఓ బ్రిటన్ పత్రికకు ఎడిటర్ గా నియమితుడైన అమోల్ రాజన్ వీరందర్లోకి ప్రత్యేకం. ఎందుకంటే, ప్రఖ్యాత 'ఇండిపెండెంట్' పత్రికకు ఓ శ్వేతజాతీయేతరుడు ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. రాజన్ ఇంతక్రితం అదే పత్రికలో కామెంట్ ఎడిటర్ గా విధులు నిర్వర్తించారు. కోల్ కతాలో జన్మించిన రాజన్ కు మూడేళ్ళ వయస్సున్నప్పుడు అతని తల్లిదండ్రులు ఇంగ్లండ్ లో స్థిరపడ్డారు.